ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం టాలీవుడ్ సినీ హీరో పవన్ కళ్యాణ్ తన వంతు సాయం

ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లి పోయిన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇపుడిపుడే కోలుకుంటుంది. ముఖ్యంగా.. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం టాలీవుడ్ సినీ హీరో పవన్ కళ్యాణ్ తన వంతు సాయంగా 20 లక్షల రూపాయలను ప్రకటించగా, తమిళ హీరో, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 


మరోవైపు తీర్థయాత్రలకు వెళ్లిన భక్తులు, పర్యాటకులపై స్థానిక ఉత్తరాఖండ్ వాసులు మాత్రం ఏమాత్రం జాలి, దయ చూపడం లేదు. అసలే ప్రకృతి ఆగ్రహానికి గురై సర్వం కోల్పోయి, ప్రాణాలతో బయటపడి కాస్తంత భోజనం కోసం యాచకులుగా మారిన పర్యాటకుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పైపెచ్చు.. ప్రస్తుతమున్న దుర్భర పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు తాహతహలాడుతున్నారు. 
ఇందులోభాగంగా హేమకుండ్‌లో తన తాతతో కలిసి చిక్కుకుపోయిన 13 ఏళ్ల హర్మన్ ప్రీత్ ఆకలితో విలవిలలాడుతున్న పరిస్థితుల్లో అక్కడి రెస్టారెంట్‌కు వెళ్లగా ప్లేటు భోజనం 500 రూపాయలు, గోధుమ రొట్టె రూ.180 అని హోటల్ సిబ్బంది చెప్పారు. చేతిలో డబ్బుల్లేని పరిస్థితుల్లో సమీప గ్రామస్థులను అడిగినా వారు కూడా ఇంత ముద్దపెట్టని హృదయ విదారకర పరిస్థితిని అనుభవించారు. 
దీంతో చేసేదేమీ లేక పక్కనే ఓ చెత్తబుట్ట కనిపిస్తే అందులో దొరికిన బ్రెడ్ ముక్క తిని 40 గంటల పాటు నడిచింది. ఎట్టకేలకు స్వరాష్ట్రమైన పంజాబ్‌కు చేరుకోగలిగారు. ఇలాంటి హృదయ విదారక సంఘటనలు చాలానే జరుగతున్నట్టు వరద కోరల నుంచి ప్రాణాలతో బయటపడిన పర్యాటకులు చెపుతున్నారు.


0 comments: