Bollywood actress Sonam Kapoor has crying during press meet

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. అందాలను ఆరబోయడంలో ఆమెకు ఎంతమాత్రం సిగ్గుబిడియం ఉండవని బాలీవుడ్ సినీజనం అంటారు. ఆమధ్య కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు ఎదను పట్టి ఉంచే టాప్‌కు బదులు ఎద అందాలు ముప్పావు వంతు ప్రదర్శించగల దుస్తులను వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిందట. ఇలా ఎన్ని జిమ్మిక్కులు చేసినా సోనమ్ కపూర్‌కు మాత్రం సినిమాల దగ్గరకొచ్చేసరికి మంచి హిట్టు ఒక్కటి కూడా రాలేదు. 

తాజాగా రజినీకాంత్ అల్లుడు ధనుష్ సరసన నటించిన రాంజానా చిత్రం అనూహ్యంగా సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి అమ్మడు నక్షత్రాల్లో తేలుతోందట. ఇటీవల తన తాజా చిత్రం ప్రెస్ మీట్‌కు వచ్చిన సోనమ్ ఉన్నట్లుండి స్టేజిపైనే తెగ ఏడ్చేసిందట. ఆమె అలా ఏడుస్తుండటాన్ని చూసిన నిర్వాహకులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారట. 

ఎందుకు ఏడుస్తున్నావంటూ ఎవరు అడిగినా సమాధానం మాత్రం చెప్పలేదట. నవ్వుతూ ఏడూస్తూ అలానే ఉందట. పాపం ఏం గుర్తొచ్చిందో పిల్లకు అంటూ కొందరు అనుకున్నారట. సినీజనం మాత్రం ఇంకేముంది.. మంచి హిట్ దొరకడంతో ఆమె ఆనందంతో కూడిన ఏడ్పును ఏడుస్తుందంటూ అనుకున్నారట. అదీ సంగతి.

0 comments: