Hero Sivaji Acting as Social reformer in 'Kamalato na prayanam

పడుపు వృత్తి నుంచి బయటపడాలని, ఓ మంచి జీవితాన్ని గడపాలని ఆశించే ఓ వేశ్య కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. ‘1940లో ఓ గ్రామం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో అర్చన వేశ్యగా నటిస్తున్నారు. శివాజి కథానాయకుడు. ఇసనాక సునిల్‌రెడ్డి, సిద్దార్ధ బోగోలు నిర్మాతలు. 

దర్శకుడు మాట్లాడుతూ -‘‘1950 నేపథ్యంలో సాగే మీరియాడికల్ మూవీ ఇది. ప్రేక్షకుల్ని ఆ రోజులకు తీసుకెళుతుందీ సినిమా. వేశ్య వృత్తిలో ఉండే స్త్రీల మనోగతాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. కమలను బయటకు తెచ్చి సంఘాన్ని ఎదిరించి మరీ కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆశించే సంఘసంస్కర్త గోపాలంగా ఇందులో శివాజీ నటిస్తున్నారు. 

కమలతో వేశ్యావృత్తి చేయిస్తూ జీవితాన్ని గడిపే శేషమ్మగా పావలా శ్యామల నటిస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఇందులోని పాత్రలు ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘40 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూలై రెండో వారంలో నుంచి 20 రోజుల పాటు రాజమండ్రి, పూడిపల్లి, టేకూరు, దేవీపట్నం పరిసరాల్లో రెండో షెడ్యూల్ జరుగుతుంది. ఊటీ, హైదరాబాద్‌లలో జరిగే మూడో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని నిర్మాతలు చెప్పారు.

0 comments: