Bollywood star Imran hasmito doing it again, he should not have said that Actress vidyabalan

‘ది డర్టీ పిక్చర్’ చిత్రం తర్వాత కొద్దికాలం వ్యవధిలోనే మళ్లీ ఇమ్రాన్ హష్మీతో నటిస్తానని తాను అనుకోలేదని బాలీవుడ్ తార విద్యాబాలన్ తెలిపింది. ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్‌ల మ్యాజిక్‌ను అభిమానులు మరిచిపోకముందే ‘ఘన్ చక్కర్’ చిత్రంలో మళ్లీ వీరిద్దరూ తెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇమ్రాన్‌తో కలిసి నటించడమంటే తనకు ఎంతో ఇష్టమని, ‘ఘన్ చక్కర్’ చిత్రం తర్వాత మా ఇద్దర్నీ కలిపి మరిన్ని చిత్రాల్లో నటించేలా చేయడం ఖాయమని విద్యాబాలన్ ధీమాగా ఉంది. 

తెరపై పండిన మా ఇద్దరి కెమిస్ట్రీని చక్కగా వినియోగించుకొని మరో చిత్రాన్ని దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా నిర్మించాలని విద్యాబాలన్ కోరింది. ‘ఘన్ చక్కర్’ చిత్రం సాదాసీదా చిత్రం కాదని.. ఈ చిత్రంలో ఇద్దరి పాత్రలు విభిన్నమైనవని వెల్లడించింది. ఓ క్రేజీ క్యారెక్టర్‌ను ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా పోషించాడని ప్రశంసలతో ముంచెత్తింది. ఓ ఆరిస్ట్‌గా ఎదగడానికి అన్ని అడ్డంకులు ఎదుర్కొని విజయం సాధించిన విధంగానే... 

ఈ చిత్రంలో నీతు ఆత్రే ఆలియాస్ మిసెస్ ఘన్ చక్కర్ పాత్రలో ఒదిగిపోయిందని విద్యాబాలన్‌ను ఇమ్రాన్ అభినందించారు. అయితే మళ్లీ ‘డర్టీ పిక్చర్’ లాంటి మ్యాజిక్‌ను వీరిద్దరి కె మిస్ట్రీ అందిస్తుందా లేదా అనే విషయం జూన్ 28న తేలనుంది

0 comments: