the police revealed that the presence of Ram Charan! attacked on Techie's

ఆమధ్య కారుకు అడ్డు వచ్చారంటూ ఇంజినీర్లను తమ అంగరక్షకులతో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను చితకబాదించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హెచ్ఆర్సీకి పోలీసులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కొట్టేటప్పుడు రామ్ చరణ్ అక్కడే ఉన్నారంటూ పోలీసులు తెలిపారు. 

ఐతే తాను ఘటన స్థలంలో లేననీ, వారు కొట్టారన్నది తనకు తెలియదని రామ్ చరణ్ తేజ హెచ్ఆర్సీకి విన్నవించారు. కాగా దెబ్బలు తిన్న ఇంజినీర్ల వద్ద నుంచి కానీ, కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ చరణ్ నుంచి కానీ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని జూబ్లిహిల్స్ పోలీసులు హెచ్ఆర్సీకి విన్నవించారు.

0 comments: