Love Shock cousin sister Kajal turtle speed Sister Nisha rabbit run ..

అక్క కాజల్ అగర్వాల్‌కు చెల్లి నిషా అగర్వాల్ లవ్ షాక్ ఇచ్చిందట. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెల్లిమెల్లిగా కెరీర్లో నిలదొక్కుకుని నెం.1 రేంజ్‌కు ఎదిగింది. అక్కను చూసి తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిషా అగర్వాల్ మాత్రం చిన్నాచితకా చిత్రాలతోనే సరిపెట్టుకుంటోంది. 

భారీ సినిమా ఆఫర్లను రాబట్టుకోవడంలో అక్కను మించలేని నిషా అగర్వాల్ ఓ విషయంలో మాత్రం దూసుక వెళుతోందట. ఆ విషయం ఏంటయా అని చూస్తే, ప్రేమ విషయం అని తేలందట. నిషా అగర్వాల్ ఓ వ్యక్తితో లవ్ లో పీకల్లోతు కూరుకుపోయినట్లు టాలీవుడ్ భోగట్టా. 

ఐతే కాజల్ అగర్వాల్ మాత్రం ఇంతవరకూ ప్రేమదోమల్లాంటి జోలికెళ్లకుండా సినిమాలే లోకంగా ఉన్నదట. మొత్తానికి ప్రేమ విషయంలో మాత్రం అక్కయ్య కాజల్ అగర్వాల్‌ది తాబేలు వేగం అయితే చెల్లి నిషా అగర్వాల్‌ది కుందేలు వేగం అని టాలీవుడ్ జనం అనుకుంటున్నారు.

0 comments: