Hero Sudheer Babu New Movie Have Launched Yesterday in Hyderabad

సుధీర్‌బాబు కథానాయకుడిగా 'మాయదారి మల్లిగాడు' చిత్రం బుధవారం అన్నపూర్ణ స్డూడియోలో ప్రారంభమైంది. హనుమాన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రేట్‌ ఆంధ్ర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రేవన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం 'గేమ్‌ విన్‌ అవ్వాలంటే మైండ్‌లో టార్గెట్‌ రన్‌ అవ్వాలి' అనే డైలాగ్‌తో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ క్లాప్‌నిచ్చారు. మంచు లక్ష్మీప్రసన్న కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రేవన్‌ కుమార్‌ మాట్లాడుతూ... నిర్మాతగా తొలి చిత్రమిది. జులై 10 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. మూడు షెడ్యూల్స్‌తో సినిమాను పూర్తిచేస్తాం అన్నారు.

దర్శకుడు హనుమాన్‌ మాట్లాడుతూ... 10 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. దర్శకుడిగా మొదటి చిత్రమిది. కృష్ణగారు నటించిన 'మాయదారి మల్లిగాడు' చిత్రానికి ఈ చిత్రానికి సంబంధం ఉండదు. కథకు యాప్ట్‌ అవుతుందని ఈ టైటిల్‌ సెలెక్ట్‌ చేశాము. సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రముంటుంది. నాకీ అవకాశం ఇచ్చిన హీరో, నిర్మాతలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. 

సుధీర్‌బాబు మాట్లాడుతూ... ప్రేమకథా చిత్రమ్‌ సక్సెస్‌ తరువాత చాలా ఆఫర్స్‌ వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్‌ కంటే ముందే ఈ సినిమా సైన్‌ చేశాను. హనుమాన్‌ చెప్పిన కథ నచ్చి వెంటనే ఓకే చేశాను. నాకు సూటయ్యే స్టోరీ ఇది. 'ఎస్‌.ఎమ్‌.ఎస్‌', 'ప్రేమకథా చిత్రమ్‌' చిత్రాల్లో చేసిన రెండు క్యారెక్టర్లు ఈ చిత్రంలో కనిపిస్తాయి. ఇందులో నా పేరు మల్లిఖార్జున్‌. కథకు యాప్ట్‌ అవుతుందని మావయ్యగారు నటించిన టైటిల్‌ పెట్టాము.

ఈ సినిమా గురించి మావయ్యగారితో ప్రస్తావించినప్పుడు 'మాయదారి మల్లిగాడు' సినిమా నా గెటప్‌ వల్లే సక్సెస్‌ అయింది'. నువ్వు కూడా గెటప్‌ విషయం కేర్‌ తీసుకో అని చెప్పారు. ఆయన మాటను నేను పాటిస్తాను. ఇందులో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాను. నిర్మాత నాకు మిత్రుడు. ఫ్రెండ్‌షిప్‌ కోసం చేస్తున్న చిత్రమిది. కాబట్టి బాధ్యతగా చేయాల్సిన అవసరముంది అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రధన్‌, మాటల రచయిత సవ్యసాచి శ్రీనివాస్‌ డిఓపి మి.ఎల్‌ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

0 comments: