Hero Siddartha breaking cooments on Tollywood

నటుడు సిద్ధార్థ్‌కు తెలుగులో వరుస అపజయాలు ఎదురుకావడంతో తమిళం వైపు మొగ్గు చూపుతున్నాడు. అక్కడ మంచి అవకాశాలు రావడంతో తెలుగు సినిమాను సిద్ధార్థ్‌ చిన్న చూపు చూశాడు. కోలీవుడ్‌ సినీ పరిశ్రమను కాకా పట్టడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. తెలుగు ప్రేక్షకులకు అసలు సినిమాలు చూడటమే రాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' తమిళ వెర్షన్‌ విజయోత్సవ సభలో సిద్థార్థ్‌ ఆదివారం పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకులు వైవిధ్యాన్ని అంగీకరించరని అన్నారు. జాతీయ అవార్డు వచ్చిన నటులను సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరించరని విమర్శించాడు. తెలుగు ప్రేక్షకులు ప్రేమకథలను మాత్రమే ఆదరిస్తారని వ్యంగ్యంగా అన్నాడు. పెద్ద హీరోలు, నిర్మాతల సినిమాలే టాలీవుడ్‌ తెరపై ఆడుతాయని పేర్కొన్నాడు.

0 comments: