Maruthi producing another Romantic Movie called "Romance" hit the screens soon
‘‘శరీరాలతో సంబంధం లేకుండా మనసుతో ప్రేమను వ్యక్తం చేయడమే నిజమైన ‘రొమాన్స్’. పెళ్లికి ముందు నిజమైన ప్రేమికుల మనోభావాలకు దర్పణం ఈ సినిమా’’ అని దర్శక, రచయిత ‘డార్లింగ్’ స్వామి అన్నారు. ఆయన దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రొమాన్స్’. ప్రిన్స్, డింపుల్, మాసన ప్రధాన పాత్రధారులు.
మారుతి సమర్పణలో జి.శ్రీనివాసరావు, ఎస్‌కేఎన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 90 శాతం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘డార్లింగ్’ స్వామి మాట్లాడుతూ -‘‘నిజమైన ప్రేమికుల రొమాన్స్ ఎలా ఉంటుంది? ప్రేమను గెలిపించుకోడానికి వారు పడే తాపత్రయం ఎలా ఉంటుంది? అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వాస్తవికతకు అద్దం పట్టే భావోద్వేగాలే ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాలో ఎక్కడా ద్వంద్వార్ధాలకు తావుండదు. అందరూ అంగీకరించేలా సినిమా ఉంటుంది’’ అని చెప్పారు.
మంచి సినిమాను అందించాలనే తపనతో ‘డార్లింగ్’ స్వామిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘రొమాన్స్’ చిత్రాన్ని నిర్మిస్తున్నామని మారుతి చెప్పారు. విజయవంతమైన సినిమాకుండాల్సిన అర్హతలన్నీ ఉన్న కథ కావడం వల్లే స్వామికి ఈ అవకాశం ఇచ్చామని ఆయన అన్నారు. ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మారుతి అభిప్రాయపడ్డారు. పెద్ద టెక్నీషియన్లు పనిచేసిన చిన్న సినిమా ఇదని, ఈ నెల 29న పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
Source from sakshi

0 comments: