Sexy Beauty Anushka has been reduced 14 kgs for Rudrama devi Movie

హీరోయిన్లు తమకు వచ్చే పాత్రల కోసం బాడీని సరిచేసుకోవడం మామూలే. నటి అనుష్క స్లిమ్‌గానే ఉంటుంది. కానీ రెండు చారిత్రాత్మక నేపథ్యం గల చిత్రాల్లో నటిస్తోంది. అందులో బాహుబలి కంటే రుద్రమదేవిగా నటించాలంటే దర్శకుడు గుణశేఖర్‌ ఒళ్లు తగ్గించుకోవాలని సూచన చేశాడట.

దీంతో ఇప్పటికి దాదాపు 14 కేజీల బరువు తగ్గాననీ, ఇంకా ఒక్క కేజీ తగ్గుతానని అంటోంది. ఆమె సూర్యతో కలిసి నటించిన సింగం-2 చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.... సింగం-2 చిత్ర దర్శకుడు హరి, హీరో సూర్య లేకపోతే సినిమానే లేదు. నా పాత్ర పరిమితం. అయినా చాలా బాగుంగుందని చెప్పింది.

గతంలో చేసిన అరుంధతి, పంచాక్షరి చిత్రాల కోవలో రుద్రమదేవి ఉండదనీ... వాటిని మించిన కథతో గుణశేఖర్‌ రూపొందిస్తున్నారని అంది. ఈ రెండు చిత్రాల కోసం కత్తియుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకోవడం చాలా సరదాగా ఉందని గుర్తుచేసుకుంది.

0 comments: