Surya సింగం2 Audio released yesterday in Hyderabad
‘తెలుగులో విడుదలైన నా ప్రతి సినిమాని ఆదరించి విజయం చేకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. అనుబంధాల విలువ, సామాజిక బాధ్యతలు తెలియజేసే చిత్రం ఇది. పోలీసుల మనోభావాలకు దగ్గరగా ఉంటుంది. ‘యముడు’కన్నా రెట్టింపు వినోదాన్నిస్తుంది. హరితో నేను చేసిన నాలుగో చిత్రం ఇది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు ఓ ఎస్సెట్ అవుతాయి’’ అన్నారు సూర్య.
‘యముడి’కి సీక్వెల్‌గా హరి దర్శకత్వంలో సూర్య, అనుష్క, హన్సిక కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సింగమ్-2’. స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్‌రాజా సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్‌కుమార్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో శ్రీను వైట్ల సీడీని ఆవిష్కరించి, కార్తీకి ఇచ్చారు. ఒక స్టార్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ హీరో సూర్యలో ఉన్నాయని, అందుకే తన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని శ్రీను వైట్ల అన్నారు. అన్నయ్యను పోలీస్ డ్రెస్‌లో చూస్తుంటే నాక్కూడా పోలీస్ పాత్రలు చేయాలని ఉందని కార్తీ చెప్పారు.
లక్ష్మణకుమార్ మాట్లాడుతూ -‘‘నిర్మాతగా నాకిది మొదటి సినిమా. సూర్యలాంటి స్టార్‌తో మొదటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. జ్ఞానవేల్‌రాజా, కార్తీ ఇచ్చిన సహకారం మరువలేనిది’’ అన్నారు. సూర్యతో చేసిన గత మూడు చిత్రాలు ఘనవిజయం సాధించినట్లే ఈ ‘సింగమ్’ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని హరి అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ ‘సింగం’ అనేది ఓ బ్రాండ్ అయిపోయింది.
హిందీలో కూడా ఈ బ్రాండ్ విజయం సాధించింది’’ అన్నారు. సూర్య, హరి లేకపోతే ఈ సినిమా లేదని, దేవిశ్రీ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చారని, ఈ సబ్జెక్ట్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందని అనుష్క తెలిపారు. ఇందులో పదునైన సంభాషణలు ఉన్నాయని శశాంక్ వెన్నెలకంటి అన్నారు. తమ సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల్లానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని జ్ఞానవేల్‌రాజా చెప్పారు
Source from sakshi

0 comments: