Teja '1000' abadhalu Movie has Ready for release
‘‘సాయిరామ్‌శంకర్ తనతో సినిమా చేయమని నన్ను అడిగినప్పుడు చేయాలా వద్దా అని సంశయించాను. కొందరు శ్రేయోభిలాషులు చేయొద్దన్నారు. వాళ్లు చేయొద్దన్నారు కాబట్టి నేను చేశాను. వద్దంటే చేసే రకం కదా మనం’’ అన్నారు నవ్వుతూ తేజ. ఆయన దర్శకత్వంలో సాయిరామ్‌శంకర్, ఎస్తేర్ జంటగా ప్రభాకర్ నిర్మించిన చిత్రం ‘1000 అబద్ధాలు’. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల తొలివారంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజ మాట్లాడుతూ -‘‘తనకు తాను మంచివాణ్ణని భావించే యువకుని కథ ఇది. తను అనుకున్నది సాధించడం కోసం కొన్ని అబద్దాలాడతాడు. మరి ఈ అబద్ధాలతో తాను అనుకున్నది సాధించగలిగాడా? అనేది చిత్ర కథ. ఈ పాత్ర కోసం సాయిరామ్‌శంకర్ గెటప్‌ని కూడా పూర్తిగా మార్చేశాం. తను చాలా బాగా చేశాడు. సక్సెస్‌లో ఉన్నాడా? లేదా అని చూసే అలవాటు నాకు లేదు.
అందుకే రమణగోగులని సంగీత దర్శకునిగా తీసుకున్నా. నా నమ్మకాన్ని వమ్ముచేయకుండా తను మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 80 శాతం కామెడీ ఉంటుంది. 20 శాతం డ్రామా ఉంటుంది. అందుకే ‘1000 అబద్ధాలు’ డ్రామెడీ మూవీ. సినిమా పూర్తయ్యేనాటికి నిర్మాత దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. అలాంటి సమయంలో డి.సురేష్‌బాబు ఈ సినిమా చూసి సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తామని చెప్పారు.
ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని మా నమ్మకం’’ అన్నారు. ఇందులో తనను కొత్తగా చూపించారని సాయిరామ్‌శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకూ పెద్ద సినిమాలకు మధ్య ఉన్న గీతను చెరిపేసే సినిమా ఇదని నిర్మాత నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాలో కథానాయికగా అవకాశం రావడం పట్ల ఎస్తేర్ సంతోషం వెలిబుచ్చారు. కెమెరామేన్ రసూల్, నటుడు నవీన్, కళా దర్శకుడు హరివర్మ కూడా పాల్గొన్నారు

0 comments: